సంపూర్ణ ఆరోగ్యమే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యం

MLA Meka Pratap Apparao Launched YSR Kanti Velugu Scheme In Nuzvid - Sakshi

నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు

సాక్షి, కృష్ణాజిల్లా: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపునందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వి నియోగ పరుచుకోవాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో "వైఎస్సార్ కంటి వెలుగు" పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు బాలికలతో పాటు ఎమ్మెల్యే ప్రతాప్ సయితం  వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకున్న బాలికలకు కార్డులు అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ నాయకుడి లక్ష్యం అన్నారు.  నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఉపవైద్య అధికారి డి.ఆశా, వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరును వివరించారు.

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికే: ఎమ్మెల్యే అనిల్‌
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన"వైఎస్సార్ కంటి వెలుగు" పథకం చాలా అద్బుతం అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా పామర్రు జడ్పీ హైస్కూల్లో "వైఎస్సార్ కంటివెలుగు" పథకాన్ని  అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు వల్ల కంటి సమస్యలను గుర్తించి కళ్ళజోళ్ళను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్ది దశలోనే కంటి సమస్యలను గుర్తిస్తే వారి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు..
మాటతప్పని మడమతిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు అంబరాన్నంటాయి. కూచిపూడి ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక నాలుగురోడ్ల కూడలిలో ఆటోవాలాలు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను ఊరేగింపుగా తీసుకెళ్ళి  వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానసభలో ఎమ్మెల్యేను ఆటోవాలాలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 1.37 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతులయ్యారని.. దీన్ని కూడా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఏ ప్రభుత్వం చేయలేదని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌ తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆటో కార్మికుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు రూ.10 వేలు నగదు అందించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఆటోయూనియన్ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top