కొల్లేరు ఉప్పునీటి సరస్సుగా మారుతోంది

MLA Grandhi Srinivas Says Kolleru Is Becoming A Saltwater Lake - Sakshi

ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌

సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కొల్లేరు సరస్సు ఉప్పు నీటి సరస్సుగా మారిపోతుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరుకు ఉన్న 67 మేజర్‌, మైనర్‌ డ్రెయిన్‌ల నుంచి నీరు రాకపోవడంతో ఎండిపోతుందన్నారు. కొల్లేరు లోతు పెంచి నీటి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ముందన్నారు. సముద్రం నుండి ఉప్పు టేరుకు, ఉప్పుటేరు నుండి కొల్లేరుకు ఉప్పు నీరు రాకుండా రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతంలో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరును పరిరక్షించి పక్షి జాతులను కాపాడాలని, కొల్లేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. గత నెల 28న కొల్లేరు పరిరక్షణకు కలెక్టర్‌ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం జరిగిందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top