పి.గన్నవరం వద్ద శనివారం జరిగిన ఆటో ప్రమాదంలోగల్లంతైన బాలిక మేరీగ్రేస్ మృతదేహం ఆదివారం దొరికింది.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాళెం గ్రామ శివారులోని కాలువలో గల్లంతైన బాలిక మేరీగ్రేస్ ఆదివారం మధ్యాహ్నం శవమై కాలువలో తేలింది. శనివారం ఆటో బోల్తాపడి బాలిక కాలువలో గల్లంతైన విషయం విదితమే. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. మధ్యాహ్నం బాలిక శవం కాలువలో తేలింది. ముగ్గురు కాలువలో గల్లంతైనట్లు శనివారం పుకార్లు వచ్చినా మేరీ గ్రేస్ ఒక్కటే గల్లంతైందని స్థానికులు, పోలీసులు ఆదివారం తెలిపారు.