అబ్బాయికి 14.. అమ్మాయికి 23

Minor Boy Marriage With Young Woman In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: ఓ బాలుడికి, యువతికి వివాహం చేసిన ఘటన  జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని ఉప్పరహాల్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడికి అక్క కూతురు అయిన కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప తాలుకా చాణికనూరు గ్రామానికి చెందిన అయ్యమ్మ(23) అనే యువతితో వివాహం చేశారు. ఈ వివాహం ఉప్పరహాల్‌లో గత నెల 27న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ విషయంపై గ్రామంలో చర్చించుకోవడంతో మీడియా దృష్టికి వచ్చింది.

కాగా.. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్రామంలో విచారించగా ప్రస్తుతం ఆ జంట ఊర్లో లేదు. అయితే వయోభేదం ఎక్కువగా ఉండే పెళ్లిళ్లతో సామాజికంగా చాలా సమస్యలు వస్తాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. మైనర్‌ బాలుడికి పెళ్లి చేయడం చట్టప్రకారం నేరమని గుర్తు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top