
జి.కొండూరు(కృష్ణాజిల్లా): జి.కొండూరు మండలం గంగినేని పాలెంలో ఏపీ భారీనీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు భూక్యా కృష్ణ పై గ్రామ సర్పంచ్ మంగళంపాటి వెంకటేశ్వరావు దాడి చేశారు. తన వర్గీయులతో కలిసి భూక్య కృష్ణ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. దాడిలో కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి.
దీంతో కృష్ణను చికిత్స నిమిత్తం హుటాహుటిన మైలవరం ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ విజయవంతం కావాలని గ్రామంలో పూజలు నిర్వహించడాన్ని సహించ లేక దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు.