breaking news
Uma Mageshvar Rao
-
మంత్రి దేవినేని ఉమా అనుచరుల దౌర్జన్యం
-
మంత్రి దేవినేని ఉమా అనుచరుల దౌర్జన్యం
జి.కొండూరు(కృష్ణాజిల్లా): జి.కొండూరు మండలం గంగినేని పాలెంలో ఏపీ భారీనీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు భూక్యా కృష్ణ పై గ్రామ సర్పంచ్ మంగళంపాటి వెంకటేశ్వరావు దాడి చేశారు. తన వర్గీయులతో కలిసి భూక్య కృష్ణ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. దాడిలో కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కృష్ణను చికిత్స నిమిత్తం హుటాహుటిన మైలవరం ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ విజయవంతం కావాలని గ్రామంలో పూజలు నిర్వహించడాన్ని సహించ లేక దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి సదస్సు
శామీర్పేట్ : మండలంలోని తుర్కపల్లిలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అడ్వాన్స్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్’ జాతీయ స్థాయి సదస్సు శనివారం సాయంత్రం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ఉమా మంగేశ్వర్రావు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదుతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలు సెమినార్లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను ఇతరులకు పంచే అవకాశం కలుగుతుందన్నారు. సెమినార్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లోని స్టేజి ఫియర్ తొలగించే వీలుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సెమినార్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ డా.ఎస్డీ షణ్ముగ కుమార్, కన్వీనర్ ఫల్గుణ, ప్రిన్సిపాల్ రమణమూర్తి, కమిటీ సభ్యులు నాగస్వామి వెంకటేశ్, డా. రామ్మోహన్గుప్తా, డా. కన్నన్ వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.