నాసిరకం అన్నమే పెడుతున్నాం..: రావెల | minister ravela kishore babu comments | Sakshi
Sakshi News home page

నాసిరకం అన్నమే పెడుతున్నాం..: రావెల

Nov 26 2014 1:26 AM | Updated on Sep 2 2017 5:06 PM

సంక్షేమ హాస్టళ్లలో నాసిరకం బియ్యం తో వండిన అన్నాన్నే పిల్లలకు పెడుతున్నట్లు ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు అంగీకరించారు.

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లలో నాసిరకం బియ్యం తో వండిన అన్నాన్నే పిల్లలకు పెడుతున్నట్లు ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు అంగీకరించారు. హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం, వంట నూనెలను అందజేయాలని ఆదేశించినట్టు చెప్పారు. మంత్రి రావెల మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు సమస్యలను నేరుగా తెలియచేసేందుకు ఏర్పాటైన టోల్‌ఫ్రీ నంబరు 1800 425 1352ని ఆయన ప్రారంభించారు. బాలికల సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి రావెల చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement