వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లె | Minister palle raghunatha reddy takes on ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లె

Jan 6 2015 1:50 PM | Updated on Oct 1 2018 2:00 PM

వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లె - Sakshi

వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లె

ఏపీ రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం లేదని మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు.

హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం లేదని మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ తాము రైతులను భయబ్రాంతులకు గురి చేయటం లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాధరెడ్డి ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

భూములు ఇచ్చేవారి వద్ద నుంచే తీసుకుంటామని, ఇవ్వనివారిని వదిలేస్తామని ఆయన అన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో రైతులు లేరని, వైఎస్ఆర్ సీపీ కొంతమందిని రెచ్చగొడుతోందని పల్లె రఘునాధరెడ్డి ఆరోపించారు. కాగా ఏపీ రాజధాని ప్రాంత రైతులు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ నరసింహన్ను కలిసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement