
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న ఆంధ్రా జాలర్లను విడిపించడానికి కృషి చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన శనివారం అమృత్‌సర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం నాలుగు గంటలలోపు వాఘా బోర్డర్ వద్ద మత్స్యకారులను అప్పగించే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. పాక్ చెరలో బందీలుగా ఉన్న జాలర్లు వస్తారో రారో అని వారి కుటుంబసభ్యులు ఇన్నాళ్లూ ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. మత్స్యకారులను రేపు(మంగళవారం) సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి విమానంలో పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు.
(చదవండి: ఫలించిన ఎంపీ విజయసాయి ప్రయత్నాలు)