ఇళ్ల స్థలాలపై టీడీపీ దుర్మార్గ రాజకీయం

Minister Mopidevi Venkata Ramana Comments On Chandrababu - Sakshi

మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

సాక్షి, విజయవాడ: దేశంలోనే ఆక్వా ఉత్పత్తులో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలన్ని అస్తవ్యస్తమయ్యాయని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుందని తెలిపారు. ఆక్వా ఉత్తత్తి చేసే రైతులందరిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించిన అనుమతులు లేకపోవడంతో ఆక్వా మెరైన్‌ ఎక్స్‌ఫోర్ట్‌ ఇండియా ఛైర్మన్‌ను పిలిపించి మాట్లాడారని తెలిపారు.
(అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించాలి)

త్వరలో ఆక్వా ఆథారిటీ ఏర్పాటు..
గిట్టుబాటు ధరను కల్పించిన ముఖ్యమంత్రికి ఆక్వా రైతులు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్వా, ఫిషరీష్‌ రోజుకు 250 లారీలు ద్వారా ఎగుమతులు అయ్యేవని.. అవి 50 లారీలకు ఎగుమతులు పడిపోయాయని వివరించారు. సీఎం చొరవ చూపి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్కెట్‌లు తెరిపించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆక్వా, ఫిష్ కల్చర్, మెరైన్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆక్వా ఆథారిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
(క‌రోనా: 17 వేల మంది ఖైదీల విడుద‌ల‌) 

అప్పుడు రానివి.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా..?
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి  ధ్వజమెత్తారు. కాకినాడలో భూసేకరణ చేసే చోట చంద్రబాబు టిట్కో ద్వారా ఇళ్లు  నిర్మించారని.. అప్పుడు గుర్తుకు రాని మడ అడవులు ఆయనకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలపై టీడీపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మంత్రి మోపిదేవి మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top