పనులు ఆగలేదు..అవినీతి ఆగింది.. | Minister Avanthi Srinivas Comments On TDP Corruption | Sakshi
Sakshi News home page

పనులు ఆగలేదు..అవినీతి ఆగింది..

Sep 9 2019 5:20 PM | Updated on Sep 9 2019 6:10 PM

Minister Avanthi Srinivas Comments On TDP Corruption - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అమరావతిలో పనులు ఆగలేదని.. అవినీతి మాత్రమే ఆగిందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేసేందుకు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం అని చెప్పారు. మహిళల్లో ఆనందం నిపేందుకు రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు జరగనుందని వెల్లడించారు.ఇళ్లు పేరిట టీడీపీ నాయకులు..పేదలను దోచుకున్నారని..పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. పారదర్శకంగా అర్హులకు సచివాలయంలో ఉద్యోగాలిచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement