కేర్ ఆస్పత్రిలో మోపిదేవికి పరీక్షలు | Medical Tests for Mopidevi Venkata Ramana at Care Hospital | Sakshi
Sakshi News home page

కేర్ ఆస్పత్రిలో మోపిదేవికి పరీక్షలు

Sep 3 2013 7:01 AM | Updated on Jul 6 2019 12:52 PM

చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు సోమవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర వెనునొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

 సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు సోమవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర వెనునొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు వారాల క్రితం ఆయనకు కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను అందజేశారు. ఈ క్రమంలో మోపిదేవి ఆరోగ్య పరిస్థితిపై వైద్య నివేదికలను సమీక్షించేందుకు ఆయనను కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జైలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement