శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: వైఎస్ జగన్
మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.
	హైదరాబాద్ : మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.  భారత్ను ఇస్రో శాస్త్రవేత్తలు అగ్రదేశాల సరసన నిలిపారని ఆయన అన్నారు.  ఇస్రో మరిన్ని విజయలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు.
	
	మరోవైపు మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం అవటంపై  గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఆనం రాంనారాయణరెడ్డి, డీకె అరుణ....తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
