ద్రవిడ వర్సిటీలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వేల్ వుురుగన్ అనే వ్యక్తి వివాహితపై అత్యాచార యుత్నం చేశాడు.
గుడుపల్లె: ద్రవిడ వర్సిటీలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వేల్ వుురుగన్ అనే వ్యక్తి వివాహితపై అత్యాచార యుత్నం చేశాడు. గుడుపల్లె ఎస్‌ఐ బాస్కర్ కథనం మేరకు... వుండలంలోని ఏ జ్యోగిండ్ల గ్రావూనికి చెందిన వివాహిత ద్రవిడ వర్సిటీలోని ఒక ఇంట్లో పాచి పనుల చేసకుంటూ జీవనం సాగిస్తోంది. గత శనివారం పనుల పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా వర్సిటీ ఆవరణలోని ప్రసార భవనం వద్ద వర్సిటీలోని సెక్యూరిటీ గార్డు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.
పెనుగులాటలో ఆమె తీవ్రంగా గాయపడింది. అతని నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ క్రమంలో బుధవారం తనపై అఘాయిత్యానికి ప్రయత్నించిన వ్యక్తిని గుర్తు పట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వేల్‌వుురుగన్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు.