మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని ఖమ్మం జిల్లాలో చాటుకున్నారు. చర్ల మండలం దానవాయిపేటలో మావోయిస్టుల పేరు మీద కొన్ని పోస్టర్లు వెలిశాయి.
మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని ఖమ్మం జిల్లాలో చాటుకున్నారు. చర్ల మండలం దానవాయిపేటలో మావోయిస్టుల పేరు మీద కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ రిక్రూట్మెంట్లను వెంటనే నిలిపివేయాలని, గిరిజనులపై పోలీసుల వేధింపులు ఆపాలని అందులో హెచ్చరించారు.
గతం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఉనికి కనపడుతున్నా, గత కొన్నాళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఈ పోస్టర్ల రూపంలో తమ ఉనికిని వారు చాటుకున్నారు.