ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం | A Mandir Collapse And Touches To Prakasam Beach Bank | Sakshi
Sakshi News home page

ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం

Feb 24 2020 2:45 PM | Updated on Feb 24 2020 6:28 PM

A Mandir Collapse And Touches To Prakasam Beach Bank - Sakshi

తీరానికి కొట్టుకు వచ్చని వెదురుతో కూడిన తెప్ప

సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement