విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
కలువాయి(నెల్లూరు): విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. చేజర్ల మండలానికి చెందిన వి. మనోహర్‌రెడ్డి(28) ఆర్టీసీలో కాంట్రాక్ట్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే శనివారం ఉదయం తల పగిలి రక్తస్రావమై రోడ్డు మీద పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు హత్య చేశారా లేక రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.