స్థల వివాదంలో అన్నను చంపిన తమ్ముడు | Man kills brother | Sakshi
Sakshi News home page

స్థల వివాదంలో అన్నను చంపిన తమ్ముడు

Apr 26 2016 6:49 PM | Updated on Jul 30 2018 8:29 PM

పుట్టపర్తి అర్బన్ మండలం కత్తివారిపల్లిలో స్థల వివాదంలో అన్నను తమ్ముడు హతమార్చాడు.

పుట్టపర్తి అర్బన్ (అనంతపురం జిల్లా) : పుట్టపర్తి అర్బన్ మండలం కత్తివారిపల్లిలో స్థల వివాదంలో అన్నను తమ్ముడు హతమార్చాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. బాబు(47), కుళ్లాయప్ప అనే సోదరుల మధ్య చాలా రోజులుగా స్థల వివాదం ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు.

పట్టరాని ఆగ్రహానికి లోనైన తమ్ముడు కుళ్లాయప్ప అన్నను ఎత్తి కింద పడేశాడు. దాంతో బాబు తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు కుళ్లాయప్ప పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య,  ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement