బెట్టింగ్‌లో ఓటమి.. గుండెపోటుతో మృతి | Man dies as heart stroke after loss in Horse betting | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌లో ఓటమి.. గుండెపోటుతో మృతి

Sep 17 2018 9:53 AM | Updated on Sep 17 2018 11:31 AM

Man dies as heart stroke after loss in Horse betting - Sakshi

బెట్టింగ్‌ ఆడేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

సాక్షి, గుంటూరు(పెదకాకాని) : గుంటూరులో పెదకాకాని రోడ్డులోని హెచ్‌ఆర్‌సీ క్లబ్‌లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందేల నిర్వహణ క్లబ్‌లో బెట్టింగ్‌ ఆడేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి పెదకాకాని వెళ్లే రోడ్డులో గత కొన్నేళ్లుగా గుర్రపు పందేలు (హార్స్‌ రేసింగ్‌ క్లబ్‌) ఆడుకునే సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌లో ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రధాన నగరాలలో నిర్వహించే గుర్రాల పందేలు ఈ క్లబ్‌లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లేపై కనిపిస్తుంటాయి. తమ డబ్బులను కాయిన్‌లుగా మార్చుకుని పందేలు కాసుకుంటూ ఉంటారు. 

తెనాలి తాలూకా చినరావూరు గ్రామానికి చెందిన శ్రీదర్‌ అలియాస్‌ రమేష్‌ గుర్రుపు పందేంలో రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలానికి పెదకాకాని ఎస్‌ఐ కె. ఆరోగ్యరాజు సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement