జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
నెల్లూరు: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు పడారుపల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వంశీకృష్ణ (35) వివాహితుడు కాగా, భార్యతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. జీవితంపై విరక్తి చెందడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.