ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేములూరు శివారు దొరయ్య
కొవ్వూరు : ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేములూరు శివారు దొరయ్య చెరువు కాలనీకి చెందిన దౌలూరి విజయ్(25) వృత్తిరీత్యా పెయింటర్. అతనికి 2013లో దుర్గతో పెళ్లైంది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి అతను పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. భార్య పనికి వెళ్లమని చెప్పినా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ పొరుగూరు వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చి చూసేసరికి విజయ్ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. దుర్గ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది.