సహకార సంఘం అధ్యక్షుడి ఆత్మహత్య | man commits suicide | Sakshi
Sakshi News home page

సహకార సంఘం అధ్యక్షుడి ఆత్మహత్య

May 3 2015 12:34 PM | Updated on Nov 6 2018 7:56 PM

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి సహకార పరపతి సంఘం అధ్యక్షుడు గాంధీ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పొన్నూరు (గుంటూరు జిల్లా ): గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి సహకార పరపతి సంఘం అధ్యక్షుడు గాంధీ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జిల్లాలోని మాచవరం రైల్వేట్రాక్‌పై జరిగింది. వివరాల ప్రకారం... ములుకుదురు గ్రామానికి చెందిన గాంధీ చింతలపూడి సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల సొసైటీలోని నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు అతనిపై ఆరోపణలు రావడంతో పోలీసులు విచారించారు. దీంతో మనస్తాపం చెందిన గాంధీ ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement