
సాక్షి, కాకినాడ: బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కిందపడ్డాడు. ఈ సమయంలో అతని గొంతులోకి ఇనుప చువ్వ దిగింది. శనివారం సాయంత్రం యానాం వద్ద ఈ సంఘటన జరిగింది. సురేష్ అనే వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తుండగా యానాం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా ఆటో రావడంతో దాన్ని తప్పించబోయాడు.
ఈ క్రమంలో బైక్‌పై నుంచి ఆయన జారిపడగా రోడ్డుపైనున్న ఇనుప చువ్వ మెడలో నుండి నోట్లోకి దూసుకొచ్చింది. వెంటనే చువ్వతోపాటు ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కుదుటగా ఉంది. యానాం వద్ద 216 జాతీయ రహదారి పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.