ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి | road accident in khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Oct 1 2024 4:36 PM | Updated on Oct 1 2024 4:56 PM

road accident in khammam district

ఖమ్మం, సాక్షి: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా బొడ్రాస్ కుంట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా వేగంగా వచ్చి  ఢీకొన్నాయి.   ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్నారు. మృతుల్లో కారేపల్లి మండలం గుట్ట కింద గుంపుకు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

చదవండి: మతపరమైన ర్యాలీల్లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం: సీవీ ఆనంద్‌

Advertisement
 
Advertisement
Advertisement