నాటు తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ | Man arrested for selling guns | Sakshi
Sakshi News home page

నాటు తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Aug 25 2015 2:56 PM | Updated on Jun 1 2018 8:36 PM

నాటు తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం : నాటు తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వడ్డె సుంకన్న(42) అనే వ్యక్తి గతంలో కూడా నాటు తుపాకుల విక్రయానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉండగా.. తాజాగా మంగళవారం అతని వద్ద తుపాకులు ఉన్నాయనే సమాచారంతో దాడి చేసిన పోలీసులకు రెండు నాటు తుపాకులు లభించాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement