పారిశుద్ధ అబద్ధం | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ అబద్ధం

Published Tue, Nov 25 2014 2:28 AM

పారిశుద్ధ అబద్ధం

సాక్షి, కడప: ఏ ఊరు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి ఊరు చరిత్ర సమస్తం మురికిమయం అన్న చందంగా తయారైంది జిల్లాలో పరిస్థితి. దేశానికి స్వాత ంత్య్రం సిద్ధించి 65 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రతి చోటా పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగానే దర్శనమిస్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నా మురికి కాలువలు పొర్లి పొంగుతున్నాయి. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరుగుతున్నాయి.

కొన్ని చోట్ల మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నారుు. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్‌ను యజ్ఞంలా నిర్వహిస్తున్నా మరోవైపు పారిశుద్ధ్యం అధ్వానంగా దర్శనమిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఘోరంగా ఉండటంతో దోమల ధాటికి జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. మురికి కాలువలున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ప్రధాన పట్టణాల్లో ఇప్పటికీ ఫాగింగ్ సైతం చేయకపోవడం దుస్థితికి అద్దం పడుతోంది.  ప్రజారోగ్యం విషయంలో అధికారులు కాకి
 లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు.

 ప్రబలుతున్న జ్వరాలు
 జిల్లాలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై దోమలు పెరిగి జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో డెంగీ కేసులు అధికారికంగా 11 అని చెబుతున్నా 30-40 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులకు సంబంధించి వేలూరు, తిరుపతి, కర్నూలులో చికిత్స పొందుతున్నారు. అలాగే మలేరియాతో 368 మంది, టైఫాయిడ్‌తో 300 మంది బాధపడుతున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement