
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం
కొయ్యలగూడెం : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన పెరువిజ్జు వీరవెంకటసత్యనారాయణ, ఇదే గ్రామానికి చెందిన చిట్రోజు దుర్గాదేవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారని, ఈ నెల 6న ద్వారకాతిరుమలలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నట్టు తెలిపారని ఎస్సై చెప్పారు. పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ తమను ఆశ్రయించారన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.