
ప్రియురాలి పెళ్లి అని తెలిసి యువకుడు..
పెళ్లి చేసుకుందామనుకుంటున్న తరుణంలో యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది.
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో ఆ ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గుండుగొలనుకుంటలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
పెళ్లి చేసుకుందామనుకుంటున్న తరుణంలో యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి వివాహం జరగనుండటంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పాలు తెస్తానని తన పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పొలానికి వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే దీనిపై ఎటువంటి పోలీస్ కేసు నమోదు కాలేదు.