అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు..  | Lockdown Restrictions Again In Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో కరోనా విజృంభణ

Jun 19 2020 5:08 PM | Updated on Jun 19 2020 6:01 PM

Lockdown Restrictions Again In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు కావడంతో మరోసారి ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి దృష్ట్యా అనంతపురం, యాడికి, పామిడి, తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తునట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు‌, ఎస్పీ సత్య ఏసుబాబు వెల్లడించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా అన్నీ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆటోలు, క్యాబ్, ఇతర ప్రైవేటు వాహనాలను కూడా బంద్‌ చేయాలని స్పష్టం చేశారు. (వ్యాక్సిన్‌ పంపిణీలో వివక్ష వద్దు: పాకిస్తాన్)‌ 

ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తాయని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో ఆంక్షలు ఉంటాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల దాకా ప్రజలకు అనుమతి ఇస్తున్నట్టు  ఎస్పీ  తెలిపారు. (ఇక మరింత కఠినంగా లాక్‌డౌన్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement