చిరుత దాడి చేసి ఆవుదూడను చంపివేసిన సంఘటన వెంకటంపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
వెంకటంపల్లి(చెన్నేకొత్తపల్లి) : చిరుత దాడి చేసి ఆవుదూడను చంపివేసిన సంఘటన వెంకటంపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
బాధితుడు ముత్యాలరెడ్డి కథనం మేరకు రాత్రి 10 గంటల సమయంలో గ్రామ సమీపంలో కట్టేసిన తమ పశువుల మందపై దాడి చేసిన చిరుత ఆరు నెలల వయసున్న ఆవుదూడను చంపివేసింది. చిరుత రాకతో మిగిలిన పశువులు గట్టిగా అరుస్తుండడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా దూడ మృతి చెందిన విషయం తెలిసింది.
ఈ సంఘటనతో రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుతలు గ్రామాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.