breaking news
venkatampalli
-
మీరు దేవాలయంలోకి వస్తే అరిష్టం
- దళితులను గుడిలోకి రాకుండా అడ్డుకున్న జనం - పోలీసులకు ఫిర్యాదు చేసిన దళితులు కంబదూరు : ఊరి చివరన గుడిసెలు.. రెండు గ్లాసుల పద్ధతి... దేవుడి దర్శనమూ కరువే.. అగ్ర వర్ణాల వారిని కనీసం తాకకూడదు.. ఇలా చెబుతూపోతే దళితులపై ఓకానొక సందర్భంలో ఎన్నో ఆంక్షలు ఉండేవి. ఈ కులవివక్షతను నిర్మూలించేందుకు ఎన్నో చట్టాలను కూడా చేయాల్సి వచ్చింది. అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారికి అవమానం జరుగుతూనే ఉంది. తాజాగా మండలంలోని వెంకటంపల్లిలో ఇటీవల ఆంజనేయస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఇందులో భాగంగానే శనివారం దళితులు పూజలు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న కొంత మంది అగ్రవర్ణలకు చెందిన వ్యక్తులు మీరు ఆలయంలోకి వస్తే మా గ్రామానికి అరిష్టం అంటూ వారిని ఆలయంలోకి రాకుండా అడ్డుకుని దాడికి యత్నించారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి తాము కూడా డబ్బులు ఇచ్చామనీ, మాకు కూడా ఆలయంలోకి రావడానికి హక్కు ఉందని ఆ దళితులు వారికి స్పష్టం చేశారు. మీరు చందాలు ఇచ్చినా సరే ఆలయంలోకి మాత్రం రానిచ్చేదిలేదనీ.. మీకిష్టమొచ్చిన వారికి చెప్పుకోండంటూ దౌర్జన్యంగా కులం పేరుతో దూషిస్తూ వారిని కించపరిచారు. ఇదే విషయంపైనే ఆదివారం దళితులు కంబదూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని మొత్తం ఎస్ఐ నరసింహుడుకి చెప్పి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి
కంబదూరు (కళ్యాణదుర్గం): కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన çపురుషోత్తం (18) అనే ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటంపల్లికి చెందిన సుబ్బరాయుడు, నాగమణి దంపతుల ఏకైక కుమారుడైన పురుషోత్తం కళ్యాణదుర్గంలోని వివేకనంద జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం తమ పొలానికి వెళ్లాడు. పక్కనున్న గొల్ల ఈర ఓబుâýæ అనే రైతుకు చెందిన పొలంలో సాగు చేసిన మామిడి చెట్లకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పెడుతుంటే పురుషోత్తం కూడా అక్కడికి వెళ్లి రన్నింగ్లో ఉన్న ట్రాక్టర్ను ఎక్కబోతూ అదుపుతప్పి కిందపడ్డాడు. అతడిపై ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ నరసింహుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుపై వరినాట్లు
కుందుర్పి : మండలంలోని వెంకటంపల్లిలో అధ్వానంగా ఉన్న రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామ మహిళలు, పురుషులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఏడాది కాలంగా చిన్నపాటి వర్షం పడితే గ్రామంలోని రోడ్లన్నీ బురదమయంగా మారి పాదచారులు సైతం నడవలేని విధంగా తయారయ్యాయి. దీంతో దోమలు అధికమై రోగాలు ప్రబలుతున్నాయని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు లిఖిత పూర్వకంగా విన్నవించినా స్పందించలేదు. దీంతో వారు ఇలా నిరసన తెలిపారు. -
ఆవుదూడను చంపిన చిరుత
వెంకటంపల్లి(చెన్నేకొత్తపల్లి) : చిరుత దాడి చేసి ఆవుదూడను చంపివేసిన సంఘటన వెంకటంపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు ముత్యాలరెడ్డి కథనం మేరకు రాత్రి 10 గంటల సమయంలో గ్రామ సమీపంలో కట్టేసిన తమ పశువుల మందపై దాడి చేసిన చిరుత ఆరు నెలల వయసున్న ఆవుదూడను చంపివేసింది. చిరుత రాకతో మిగిలిన పశువులు గట్టిగా అరుస్తుండడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా దూడ మృతి చెందిన విషయం తెలిసింది. ఈ సంఘటనతో రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుతలు గ్రామాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.