
రోడ్డుపై వరినాట్లు
మండలంలోని వెంకటంపల్లిలో అధ్వానంగా ఉన్న రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామ మíహిళలు, పురుషులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
కుందుర్పి : మండలంలోని వెంకటంపల్లిలో అధ్వానంగా ఉన్న రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామ మహిళలు, పురుషులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఏడాది కాలంగా చిన్నపాటి వర్షం పడితే గ్రామంలోని రోడ్లన్నీ బురదమయంగా మారి పాదచారులు సైతం నడవలేని విధంగా తయారయ్యాయి.
దీంతో దోమలు అధికమై రోగాలు ప్రబలుతున్నాయని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు లిఖిత పూర్వకంగా విన్నవించినా స్పందించలేదు. దీంతో వారు ఇలా నిరసన తెలిపారు.