రాష్ట్ర విభజన పనుల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఆదివారం సహా అన్ని రకాల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. రెండో శనివారం, ఆదివారం కూడా కార్యాలయాలు తెరిచే ఉంచాలని ప్రభుత్వ కార్యదర్శి మహంతి అధికారులను ఆదేశించారు.
నేడు కూడా ఉద్యోగినులు విధులకు రావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పనుల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఆదివారం సహా అన్ని రకాల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. రెండో శనివారం, ఆదివారం కూడా కార్యాలయాలు తెరిచే ఉంచాలని ప్రభుత్వ కార్యదర్శి మహంతి అధికారులను ఆదేశించారు. ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని అన్ని శాఖల అధికారులకు శుక్రవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చే శారు. సచివాలయం, హైదరాబాద్‌లోని అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో విభజనకు సంబంధించిన పనులు వేగవంతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఈనెల 8) సందర్భంగా మహిళా ఉద్యోగులందరికీ సెలవు ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఆ రోజున (శనివారం) సెలవు రద్దు చేయడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.