వైఎస్‌ఆర్ సీపీలో పలువురి చేరిక | leaders are going to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీలో పలువురి చేరిక

Mar 25 2014 2:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఎస్సీ కాలనీకి చెందిన మాలపేట వాసులంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గజపతినగరం రూరల్, న్యూస్‌లైన్: దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఎస్సీ కాలనీకి చెందిన మాలపేట వాసులంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, దత్తిరాజేరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి గొటివాడ అప్పలమ్మ ఆధ్వర్యంలో వారంతా సోమవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
కాంగ్రెస్, టీడీపీల తీరుతో విసుగు చెంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెదమానాపురం మాజీ సర్పంచ్‌లు గుటివాడ దాసు, గుటివాడ సంజీవి తెలిపారు. అన్ని మండలాల్లోనూ కాంగ్రెస్ ఖాళీ అయినట్లు సర్వేలు చెబుతున్నాయని, భవిష్యత్‌లో ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని కడుబండి శ్రీనివాసరావు అన్నారు.
 
 రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు సైని కుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీలో సుమారు 250 కుటుంబాలు చేరినట్లు పెదమానాపురం ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. కార్యక్రమంలో గుటివాడ కుప్పారావు, గుటివాడ ఆంతోని, గుటివాడ సింహా చలం, గుటివాడ గాబ్రేలు, యజ్జా భాస్కరరావు, పెదమానాపురం సర్పంచ్ సి.హెచ్.సన్యాశినాయుడు, ఉపసర్పంచ్ కె.కనక రాజు, కనిమెరక తిరుపతి, రౌతు రామునాయుడు, జిల్లా గొర్రెల పెంపకం దారుల సలహా సంఘం అద్యక్షులు బమ్మిడి అప్పలనాయుడు, సీహెచ్ సన్యాశినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement