నవ్వుల్‌ పువ్వుల్‌ | Laughing Program In vishakhapatnam | Sakshi
Sakshi News home page

నవ్వుల్‌ పువ్వుల్‌

May 7 2018 1:27 PM | Updated on May 7 2018 1:27 PM

Laughing Program In vishakhapatnam - Sakshi

ప్రేక్షకులతో కిక్కిరిసిన హాల్‌

సీతంపేట (విశాఖ ఉత్తర) : ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా లాఫ్టర్‌ ఫన్‌ క్లబ్, ఫ్రెండ్స్‌ కామెడీ క్లబ్‌  సంయుక్తంగా ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వినోదాల విందు అలరించింది. జబర్దస్త్‌ ఫేం రాపేటి అప్పారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అప్పారావు  తనదైన శైలిలో కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

క్లబ్‌ కళాకారులు కోరుకొండ రంగారావు, జి.వి.త్రినాథ్, ఎం.వి.సుబ్రహ్మణ్యం నిర్వహణలో  విశాఖ  హ్యూమర్‌ క్లబ్, క్రియేటివ్‌ కామెడీ క్లబ్, హాస్యప్రియా కామెడీక్లబ్, అనకాపల్లి లాఫింగ్‌క్లబ్‌ కళాకరులు పాల్గొని స్కిట్స్‌ ప్రదర్శించారు. భలే టైలర్, ఆర్టీటీ ఎంక్వైరీ, గుడ్‌ మెమరీ, మీ వాళ్లేమీ చెప్పలేదా స్కిట్స్‌ అలరించాయి.

పోలవరపు ప్రశాంతి చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు ఎఫ్‌.ఎం.బాబా య్, రామానుజం, అంజలి ఘోష్, ఇమంది ఈశ్వరరావు, భాను, శివరామకృష్ణ తదితరులు స్కిట్స్‌ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి.వి.మూర్తి,  కొసనా, లక్ష్మీ భార్గవి, ప్రసన్నకుమార్, కొమ్మినేని రామారావు,నండూరి రామకృష్ణ పాల్గొన్నారు. 

1
1/1

స్కిట్‌ చేస్తున్న అప్పారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement