బస్సును ఢీకొన్న లారీ | Larry bus collision | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ

Jul 20 2014 12:05 AM | Updated on Sep 2 2017 10:33 AM

బస్సును ఢీకొన్న లారీ

బస్సును ఢీకొన్న లారీ

ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొ న్న సంఘటనలో ఓ సొసైటీ ఉద్యోగి మరణించ గా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏడీబీ రోడ్డులోని పుట్టగొడుగుల

 పెద్దాపురం రూరల్ / కాకినాడ క్రైం :ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొ న్న సంఘటనలో ఓ సొసైటీ ఉద్యోగి మరణించ గా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏడీబీ రోడ్డులోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. రాజమండ్రి నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సును ఏడీబీ రోడ్డులో ఓ లారీ అదుపుతప్పి ఢీకొంది. బస్సు వెనుక సీటులో కూర్చున్న ఏడు గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను పెద్దాపురం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిలో ఆరుగురికి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో రం గంపేట సొసైటీ గుమస్తా వట్టికూటి వీరవెంకట రమణారావు (50) మరణించాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు హెచ్.మోహన్, మురళీకృష్ణ, జి.మోహన్, ఆకాశపు మణిసాయి కుమార్, కాకినాడకు చెందిన మచ్చ వినయ్‌కుమార్, ఎస్.మల్లికార్జున్, లారీ డ్రైవర్ వాసంశెట్టి కృష్ణ పెద్దాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, ఎస్సై శివకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 శుభకార్యం పిలుపునకు వెళ్తూ..
 రంగంపేట : ఈ నెల 23న తమ్ముడి కుమార్తె శుభకార్యం విషయమై చెల్లెలిని ఆహ్వానించడానికి విశాఖపట్నం వెళుతూ రమణారావు మరణిం చాడు. అతడికి భార్య అనంతలక్ష్మి, కుమారులు మణికంఠ, వీరదుర్గాప్రసాద్, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, మణికంఠ మచిలీపట్నంలోను, వీరదుర్గాప్రసాద్ గైట్ కళాశాలలోను చదువుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement