రిజిస్ట్రేషన్ల మోత

Land Registration Charges Increase In Nellore - Sakshi

వెంకటగిరి రాజావీధి తదితర ప్రాంతాల్లో చదరపు గజం స్థలం గరిష్టంగా రూ.9500 ఉండగా తాజాగా భూముల విలువ పెంపుతో రూ.10,000 దాటనుంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.1600 మించని చదరపు గజం విలువ తాజా పెంపుతో రూ.1700 పై చిలుకుగా మారనుంది. గతంలో కట్టడాల రిజిస్ట్రేషన్‌ విలువ చదరపు అడుగుకు రూ.900 ఉండగా తాజాగా రూ.950కి చేరనుంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తమ పరిధిలోని సర్వేనంబర్లు, డి నంబర్ల ఆధారంగా భూములు, స్థలాల ప్రభుత్వ మార్కెట్‌ విలువలను సమీక్షిస్తున్నారు.

వెంకటగిరి (నెల్లూరు): భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్‌ చార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో పట్టణ ప్రజలకు మరోసారి భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీల షాక్‌ తగలనుంది. వెంకటగిరి ప్రాంతంలో మన్నవరం భెల్‌ పరిశ్రమ ఏర్పాటుతో పెరిగిన రియల్‌భూమ్‌ ఆ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో పూర్తిగా పడిపోయింది. రెండేళ్ల క్రితం పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయపన్ను శాఖ నోటీసులతో భూముల క్రయ విక్రయాలు పూర్తిగా మందగించాయి. ఇప్పుడిప్పుడే రియల్‌ఎస్టేట్‌ రంగం కోలుకుంటున్న తరుణంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంపు కలకలం రేపుతోంది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టణ 

రేపటి నుంచి స్థిరాస్తి విలువలు పెంపు 
నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలోని పట్టణాల పరిధిలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్థిరాస్తి విలువలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు జిల్లా రిజిస్ట్రార్‌ అబ్రహం పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థిరాస్తి విలువ 0– నుంచి 5 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన స్థిరాస్తి విలువ ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  ప్రధానంగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల  కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో పెంచడం లేదన్నారు. మిగిలిన నెల్లూరు నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పెంచుతున్నట్లు తెలిపారు. అందు కోసం కావాల్సిన వాటిని తయారు చేసే పనిలో సబ్‌రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

జిల్లా రిజిస్ట్రార్‌ అబ్రహం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top