ల్యాండ్ రికార్డులను అప్‌డేట్ చేయండి : జేసీ | Land records Update jc | Sakshi
Sakshi News home page

ల్యాండ్ రికార్డులను అప్‌డేట్ చేయండి : జేసీ

Sep 17 2014 1:46 AM | Updated on Sep 2 2017 1:28 PM

భూ సంబంధిత రికార్డులన్నింటినీ నవంబరు 30వ తేదీలోపు అప్‌డేట్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తహశీల్దారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డులపై అమలాపురం

 అమలాపురం  : భూ సంబంధిత రికార్డులన్నింటినీ నవంబరు 30వ తేదీలోపు అప్‌డేట్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తహశీల్దారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డులపై అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం డివిజన్‌లోని అన్ని మండలాల తహశీల్దార్లతో జేసీ సమీక్షించారు. ల్యాండ్ రికార్డులన్నీ పక్కాగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా అప్‌డేట్ చేయాలన్నారు. వెబ్ ల్యాండ్ అడంగళ్‌లో తప్పిదాలకు తావులేకుండా సరిచూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు సంబంధించిన మార్పులు ఉంటే తహశీల్దార్లు ప్రొసీడింగ్‌‌సతో ల్యాండ్ రికార్డులను డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. మరణించిన భూ యజమానుల స్థానే వారి వారసులు వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదయ్యేందుకు మీ-సేవా కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్ ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిచేసుకునేందుకు రెక్టిఫికేషన్ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఆర్డీఓ టీవీఎస్‌జీ కుమార్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement