గాజువాక ఆర్టీవో కార్యాలయానికి బాంబు బెదిరింపులు | Bomb threats to the RTO office in Gajuwaka | Sakshi
Sakshi News home page

గాజువాక ఆర్టీవో కార్యాలయానికి బాంబు బెదిరింపులు

Mar 24 2026 5:03 AM | Updated on Mar 24 2026 5:03 AM

Bomb threats to the RTO office in Gajuwaka

డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది, తనిఖీలు నిర్వహిస్తున్న బాంబు స్క్వాడ్‌ బృందం

అగనంపూడి/ చిలకలపూడి(మచిలీపట్నం): సీబీఐ కేసులో నిందితుడిని కేసు నుంచి బయటపడేయాలని లేదంటే, అగనంపూడిలోని గాజువాక ఆర్టీవో కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీవోకు మెయిల్‌ పంపారు. గాజువాక ఆర్టీవో జయప్రకాష్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. పోరా్టన్‌ మెయిల్‌ డాట్‌. కామ్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం గాజువాక ఆర్టీవోకి మెయిల్‌ వచ్చింది. అందులో 15 గ్రానైట్‌ గ్యాస్‌ బాంబ్‌లతో కార్యాలయాన్ని పేల్చేస్తామని, వెంటనే సిబ్బంది ఖాళీ చేయాలని ఉండటంతో దువ్వాడ పోలీసులకు ఆర్టీవో ఫిర్యాదు చేశారు.

సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలోని డాగ్‌స్కా్వడ్, సిబ్బంది కార్యాలయం ఆరుబయట, లోపల తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు బయటపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. సీబీఐ కేసులో నిందితుడుగా కేంద్ర మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరించారని, ఈ–మెయిల్‌ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అలా చేశారో విచారణ చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

కృష్ణాజిల్లా కోర్టుకు ‘గ్యాస్‌’  బాంబు బెదిరింపు 
‘జిల్లా కోర్టులో గ్యాస్‌ బాంబు పెట్టాం. తమిళనాడు రాజకీయ నాయకుడు బాలాజీపై పెట్టిన సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలి. లేకపోతే కోర్టును పేల్చి వేస్తాం..’ అంటూ కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అధికారిక మెయిల్‌కు వచ్చిన ఒక మెసేజ్‌  కలకలం రేపింది. మెసేజ్‌ సమాచారాన్ని సోమవారం ఉదయం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపీ.. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు తెలియజేయటంతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను అప్రమత్తం చేశారు. 

దీంతో అందరూ భయాందోళనతో కోర్టు ప్రాంగణంలోకి వెళ్లకుండా వెలుపలే ఉండిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు బాంబు స్క్వాడ్‌ బృందం న్యాయమూర్తుల చాంబర్లుసహా మచిలీపట్నంలోని కోర్టు ప్రాంగణం, పరిసరాల్లో దాదాపు ఐదు గంటల పాటు అణువణువూ జల్లెడపట్టింది. ఫేక్‌ మెసేజ్‌ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement