'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం' | lack of clarity in Legislative Advisory Council, says Shobha Nagi Reddy | Sakshi
Sakshi News home page

'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం'

Jan 23 2014 6:14 PM | Updated on Oct 22 2018 5:46 PM

'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం' - Sakshi

'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం'

శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో విభజన బిల్లుపై ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధకరమని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి తెలిపారు.

హైదరాబాద్:  శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో విభజన బిల్లుపై ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధకరమని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి తెలిపారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాకపోవడం చాలా బాధకరమని ఆమె అన్నారు.

 

బీఏసీకి టీడీపీ రెండు ప్రాంతాల ప్రతినిధులను పంపి రెండు వాదనలు చెప్పిందని శోభానాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి ఆ పార్టీ విధానంపైనే స్పష్టత లేదని ఆమె విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య తీర్మానంతో పాటు.. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కోరినట్టు శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement