బీజేపీ సిగ్గు పడాలి: మంత్రి నక్కా | AP Minister Nakka Anand Babu Fires On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ సిగ్గు పడాలి: మంత్రి నక్కా

Mar 25 2018 6:32 PM | Updated on Nov 9 2018 5:41 PM

AP Minister Nakka Anand Babu Fires On BJP - Sakshi

నక్కా ఆనంద్‌ బాబు (పాత ఫొటో)

సాక్షి,గుంటూరు : టీడీపీని వదులుకున్నందుకు బీజేపీ సిగ్గుపడాలని మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు.  టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ పతనం ఏపీ నుంచే మొదలవుతుందని జోస్యం చెప్పారు. అమిత్‌ షా లేఖ ఏపీని అవమానించేలా ఉందని ఆయన ఆరోపించారు. ఆమిత్‌ షా పాత చరిత్ర తిరగేస్తే ఎవరు అవినీతి చేశారో తెలుస్తుందన్నారు.

బీజేపీతో పొత్తు వల్ల తాము 15 సీట్లు కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన 19 విభజన హమీల్లో ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని చెప్పిన మోదీ ఇప్పడు కుట్రలు చేసి ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.ఇప్పటికిప్పడు అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ వారు కూడా మద్దతు ఇస్తారని మోదీ భయపడుతున్నారని ఆనంద్‌ బాబు అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో 40శాతం ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ది చెబుతారని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement