కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎడ్లపాడు: కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో విశ్వతేజ స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన గణేశ్వరరావు (35) అనే వ్యక్తి స్పిన్నింగు మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
అయితే, కుటుంబ కలహాల వల్ల జీవితంపై విరక్తి చెందిన అతడు ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎడ్లపాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.