breaking news
ganeswara rao
-
ఆశలతో కువైట్ వెళ్లి.. అశువులు బాసి జన్మభూమికి
పాలకోడేరు: ఎన్నెన్నో ఆశలతో సముద్రాలు దాటి వెళ్లిన అతను విగత జీవిగా మారి ఇంటికి చేరుకున్నాడు. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గొరగనమూడి గ్రామానికి చెందిన కొచ్చెర్ల గణేశ్వరరావు (48) పొట్టకూటి కోసం నాలుగు నెలల క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లాడు. అక్కడ కష్టపడి సంపాదిస్తున్న డబ్బుల్లో కొంత ఇంటికి పంపిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో మృత్యువు అశనిపాతంలా తాకింది. ఈనెల 9వ తేది రాత్రి అతను గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందాడు. మృతదేహం శుక్రవారం గొరగనమూడి చేరుకుంది. మృతదేహాన్ని చూసి మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతునికి భార్య నళిని, పాప ఉంది. సర్పంచ్చెల్లబోయిన పాపారావు, ఎంపీటీసీ సభ్యుడు పంపన దామోదరం తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
కార్మికుడి ఆత్మహత్య
ఎడ్లపాడు: కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో విశ్వతేజ స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన గణేశ్వరరావు (35) అనే వ్యక్తి స్పిన్నింగు మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, కుటుంబ కలహాల వల్ల జీవితంపై విరక్తి చెందిన అతడు ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎడ్లపాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.