బాబు మోసాలను ప్రజలకు తెలియజేయండి | Kurnool Students Join In YSRCP | Sakshi
Sakshi News home page

బాబు మోసాలను ప్రజలకు తెలియజేయండి

Feb 3 2019 9:26 AM | Updated on Feb 3 2019 9:26 AM

Kurnool Students Join In YSRCP - Sakshi

వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, హఫీజ్‌ఖాన్, సలాంబాబు 

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు, కర్నూలు ఇన్‌చార్జులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, హఫీజ్‌ఖాన్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ నందికొట్కూరు డివిజన్‌ అధ్యక్షుడు దిలీప్‌తో పాటు నందికొట్కూరు, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన 200 మంది విద్యార్థులు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వారికి కండువాలు వేసి ఆహ్వానించారు.  ఈసందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు విద్యార్థి, యువతను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారంటే యువతకు ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ విజయం కోసం పనిచేయాలన్నారు.

అందులోభాగంగా చంద్రబాబు మోసాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యువత అండగా నిలవాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సలాంబాబు మాట్లాడుతూ.. నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచిన జగన్‌మోహన్‌రెడ్డి వెంట యువత నడిచేలా కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో పార్టీ అదనపు రాష్ట్ర కార్యదర్శులు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, కర్నూలు, నంద్యాల విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, సాయిరామ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు ప్రశాంత్, నాయకులు నవీన్, వై.రాజశేఖరరెడ్డి, యశశ్వని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement