మావోయిస్టు చలపతిని పట్టిస్తే రూ.20 లక్షలు | Koyyuru in Maoist Chalapathi, 20 lakh reward | Sakshi
Sakshi News home page

మావోయిస్టు చలపతిని పట్టిస్తే రూ.20 లక్షలు

Jun 7 2016 2:33 AM | Updated on Oct 9 2018 2:49 PM

దళసభ్యులకు వ్యతిరేకంగా పోస్టర్లు - Sakshi

దళసభ్యులకు వ్యతిరేకంగా పోస్టర్లు

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కొయ్యూరు పరిసరాల్లో కరపత్రాలు వెలిశాయి. వారి ఆచూకీ తెలిపిన...

కొయ్యూరు: మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కొయ్యూరు పరిసరాల్లో కరపత్రాలు వెలిశాయి. వారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామని మావోయిస్టు నాయకుల ఫొటోలతో వెలిసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి తలపై రూ.20 లక్షలు రివార్డు ప్రకటించారు. ఇటీవల మర్రిపాకలు ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆజాద్ అక్క రవి చైతన్య అలియాస్ అరుణ పేరిట రూ.5 లక్షలు రివార్డు ఉంది. వీరు కాకుండా గూడెంకొత్తవీధి మండలం మెట్టగూడకు చెందిన గెమ్మెలి జాంబ్రి తలపై రూ.4 లక్షలు రివార్డును, చింతపల్లి మండలం బలపం పంచాయతీ గిల్లెలబంద గ్రామానికి చెందిన కొర్రా నాగేశ్వరరావుపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు.

జీకేవీధి మండలం చేమగెడ్డకు చెందిన కరబాల లక్ష్మి అలియాస్ సరితపై రూ.4 లక్షలు, నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం తిరుమల గ్రామానికి చెందిన కోడా అంజయ్య అలియాస్ నవీన్‌పై రూ.4 లక్షలు రివార్డు ప్రకటించారు. వారి ఫొటోలు, వారి వివరాలను కరపత్రాల్లో ప్రకటించారు. వారి ఆచూకీ తెలిపిన వారికి లేదా పట్టుకుని అప్పగించిన వారికి మావోయిస్టులకు ప్రకటించిన నగదు మొత్తం అందజేస్తామన్నారు. ఎవరికైనా వారి ఆచూకీ తెలిస్తే 9440796002 లేదా 9440796093 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement