మంత్రులను కలిసిన కొల్లేరు రైతులు | kolleru farmers meets to ministers | Sakshi
Sakshi News home page

మంత్రులను కలిసిన కొల్లేరు రైతులు

Aug 26 2014 1:07 AM | Updated on Sep 26 2018 6:01 PM

కొల్లేరులో అటవీ శాఖ అధికారులు చెరువులను ధ్వంసం చేయడంతో పలువురు రైతులు, ఆక్వా అసోసియేషన్ నాయకులు హైదరాబాద్‌లో పలువురు మంత్రులను కలిశారు.

భీమడోలు : కొల్లేరులో అటవీ శాఖ అధికారులు చెరువులను ధ్వంసం చేయడంతో పలువురు రైతులు, ఆక్వా అసోసియేషన్ నాయకులు హైదరాబాద్‌లో పలువురు మంత్రులను కలిశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలను రైతులు కలిసి తమ గోడును తెలిపారు.
 
ఐదో కాంటూరు పక్కనే వంద మీటర్ల దూరంలో ఉన్న చెరువులను కూడా తొలగిస్తామని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోందని  అసోసియేషన్ నాయకుడు నంబూరి శివాజీరాజు మంత్రులకు తెలిపారు. కొల్లేరులో జిరాయితీ భూములను ధ్వంసం చేస్తున్నారని దీంతో రైతుల పరిస్థితి ఆధ్వానంగా మారుతుందని వాపోయారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మంత్రులు తెలిపినట్టు  ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, రైతులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement