కిరణ్ మాటలన్నీ సోనియావే: కిషన్‌రెడ్డి | Kishan Reddy Criticise Congress | Sakshi
Sakshi News home page

కిరణ్ మాటలన్నీ సోనియావే: కిషన్‌రెడ్డి

Aug 9 2013 6:29 PM | Updated on Mar 29 2019 9:18 PM

కిరణ్ మాటలన్నీ సోనియావే: కిషన్‌రెడ్డి - Sakshi

కిరణ్ మాటలన్నీ సోనియావే: కిషన్‌రెడ్డి

రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎంగా కొనసాగే అర్హత కిరణ్‌కు లేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల ఆందోళన వెనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ వెలువరించిన నిర్ణయాన్ని మీ పార్టీ నేతలు వ్యతిరేకిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ను ప్రశ్నించారు.

సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ ఎందుకు స్పందిచడం లేదని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది స్వార్ధపూరిత విష భావజాలం అని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement