అసంతృప్త నేతలకు గాలం వేయడానికి కిరణ్ పార్టీ తరఫున ప్రయత్నాలు మొదలవుతున్నాయి.
అసంతృప్త నేతలకు గాలం వేయడానికి కిరణ్ పార్టీ తరఫున ప్రయత్నాలు మొదలవుతున్నాయి. విశాఖపట్నం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలోని అసంతృప్త నేతలతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు సంతోష్ కుమార్ రెడ్డి మంతనాలు మొదలుపెట్టారు.
నేతల ఇళ్లకు వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపిస్తున్న జై సమైక్యాంధ్ర పార్టీలో చేరాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. నగరంలోని ఐదు నియోజక వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు సంతోష్‌కుమార్‌రెడ్డి వెళ్లారు. అయితే ఇప్పటివరకు ఎవరి నుంచి హామీలు లభించినట్లు మాత్రం సమాచారం లేదు.