కిరణ్.. ఇంటికే పరిమితం | Kiran kumar reddy leaves CM camp office | Sakshi
Sakshi News home page

కిరణ్.. ఇంటికే పరిమితం

Feb 21 2014 2:48 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్.. ఇంటికే పరిమితం - Sakshi

కిరణ్.. ఇంటికే పరిమితం

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అధికారిక నివాసమైన క్యాంపు కార్యాలయాన్ని వీడి ఎమ్మెల్యే కాలనీలోని తన సొంత ఇంటికి విచ్చేశారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అధికారిక నివాసమైన క్యాంపు కార్యాలయాన్ని వీడి ఎమ్మెల్యే కాలనీలోని తన సొంత ఇంటికి విచ్చేశారు. గురువారం ఉదయం హోటల్ నుంచి అల్పాహారం తెప్పించుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు సన్నిహితులతో మాట్లాడుతూ టీవీ చూస్తూ గడిపారు. 12 గంటలకు నగరంలో ఓ పెళ్లికి హాజరై 20 నిమిషాల్లోనే ఇంటికి తిరిగొచ్చారు. మధ్యాహ్నమంతా తన నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు. కుటుంబ సభ్యులతోనే గడిపారు. కాగా, రాజీనామా చేసిన తర్వాత కిరణ్‌ను గురువారం ఏ ఒక్క ఎమ్మెల్యేగానీ, మంత్రిగానీ కలవలేదు. పెద్దఎత్తున శాసనసభ్యులు వచ్చి కిరణ్‌ను కలుస్తారని అంచనా వేయగా పెద్ద నేతలెవరూ రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement