'ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారు' | KCR like a beautiful to Delhi Leaders, says Undavalli Arun Kumar | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారు'

Mar 12 2014 6:39 PM | Updated on Sep 2 2017 4:38 AM

'ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారు'

'ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారు'

తలుపు వేసి చీకట్లో దొంగచాటుగా రాష్ట్ర విభజన చేశారని కాంగ్రెస్ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

రాజమండ్రి: తలుపు వేసి చీకట్లో దొంగచాటుగా రాష్ట్ర విభజన చేశారని కాంగ్రెస్ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించి పార్లమెంట్ పరిసరాలకు రాకుండా చేసి విభజన బిల్లు ఆమోదించారని చెప్పారు. విభజన జరిగిందంటే మెడమీద తలకాయ ఉన్నవాడెవడూ ఒప్పుకోడని అన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన సాధ్యం కాదన్నారు. రాజమండ్రిలోని జెమిని మైదానంలో జరుగుతున్న జై సమైక్యాంధ్ర  పార్టీ తొలి బహిరంగ సభలో ఉండవల్లి మాట్లాడారు.

సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవిని తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు. ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీట్లు వస్తాయనే ఆశతో రాష్ట్రాన్ని విడదీస్తే... కేసీఆర్ ఏది చేయాలనుకున్నారో అదే చేశారని అన్నారు. మోసం చేయడమే కేసీఆర్ నైజమని ఉండవల్లి విమర్శించారు. రాష్ట్ర విభజన జరగనిచ్చే ప్రసక్తే లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement